పాపయ్యపల్లి లో పోచమ్మ ఆలయం పునర్నిర్మాణానికి శ్రీకారం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య : శంకరపట్నం మండలం పరిధిలోని పాపయ్య పల్లి గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయం శిథిల వ్యవస్థలో ఉండడంతో గ్రామ ప్రజలు నూతన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆలయ నిర్మాణానికి తమ మద్దతు తెలిపారు. , గ్రామ ప్రజల సమక్షంలో భూమి పూజ నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో ముగ్గు వేసి, పూజా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఏనుగుల అనిల్ మాట్లాడుతూ, గ్రామ దేవత అయిన పోచమ్మ అమ్మవారి ఆలయం గ్రామానికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలని, పునర్నిర్మాణం ద్వారా గ్రామ ప్రజల విశ్వాసం మరింత బలపడుతుందని తెలిపారు. గ్రామ అభివృద్ధి, సంప్రదాయాల పరిరక్షణలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు గ్రామ ప్రజలు ఈ శుభ కార్యక్రమం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, చాలా కాలంగా ఎదురు చూస్తున్న పోచమ్మ ఆలయ నిర్మాణం ప్రారంభమవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ ఆలయం గ్రామానికి శోభాయమానంగా మారి, భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఏనుగుల యాదగిరి, మీసా సమ్మయ్య, ఉడికే కొమురయ్య, చెంచు కొమురయ్య ,చెంచు కనకయ్య బాగోతపు చేరాల్, పాల్సాని దేవేందర్ రెడ్డి, నల్ల నారాయణరెడ్డి, పాల మల్లయ్య, అమర కొండ రవి, మీసా రాజయ్య , ఏనుగుల పైడి, ఉడికే బీరయ్య,మీసా శ్రీనివాస్, గొంగళ్ళ సదానందం , సుధాకర్, తడిగొప్పుల నారాయణ, చెంచు సంపత్ ,సుమంత్, శ్రీనివాస్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *