విజయవంతంగా ఎన్సీడీ ఆరోగ్య శిబిరం

పాలకుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న గౌడ్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 10( జనగాం ప్రతినిధి కమ్మగాని నాగన్న)పాలకుర్తి మేజర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఎన్సీడీ క్యాంప్ విజయవంతంగా జరిగినట్లు సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న గౌడ్ తెలిపారు పాలకుర్తి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని, గ్రామపంచాయతీ ఆవరణలో ఎన్సీడీ(నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) ఆరోగ్య శిబిరం బేస్తవారం ఉదయం 10 గంటలకు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్య సిబ్బంది గ్రామ ప్రజలకు రక్తపోటు, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు వంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్‌పై పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు సూచనలు అందించారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భవిష్యత్తులో కూడా మరిన్ని ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాదెపాక కిరణ్, పంచాయతీ కార్యదర్శి రూబీన, డాక్టర్ స్వప్న, పి హెచ్ ఎన్ లిల్లీ దేబోరా, హెచ్ ఎస్ ఇందిరాని, మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి రుబీనా సుల్తాన్ వార్డు సభ్యులు కామరపు సునీల్, కమ్మగాని సుధాకర్, నెమరుగోమ్ముల శ్రీనివాసరావు, కమ్మగాని శ్రీకాంత్ గౌడ్, కత్తి దస్తగిరి, గ్రామపంచాయతీ సిబ్బంది, ఏ ఎన్ ఎం స్రవంతి, స్వాతి, ఆశా వర్కర్లు, ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *