మహిళల ఆత్మ గౌరవం దెబ్బతీయటమే నీ లక్ష్యమా?

*ఏబీఎన్ రాధాకృష్ణ పై మండిపడ్డ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 10 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్ . ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయటానికి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు పలాస నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు చేరుకున్నారు ఈ సందర్భంగా. మాజీ మంత్రి పలాస మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సిదిరి అప్పలరాజు విలేకర్ల తో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి మహిళా కుటుంబ సభ్యులకు అలానే మహిళలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక కథనాన్ని ప్రచారం చేయటంపై ఆయన మండిపడ్డారు. రాధాకృష్ణ అన్నం తింటున్నారా ఆశుద్ధం తింటున్నారా అని సూటిగా ప్రశ్నించారు. ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ, ఆ పార్టీ వలన లబ్ధి పొందుతూ, వేరొక పార్టీ వారిని అణగదొక్కటానికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యొక్క ముఖ్య లక్ష్యంగా పేర్కొన్నారు. వైసీపీ పార్టీ వెనుముక లేని పార్టీ అన్నారని ఆయన చూశారా అని ప్రశ్నించారు . వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఈ రాష్ట్రంలో నిరసనలు కూడా చేయకూడదా? దీనిపై కొన్ని మీడియా సంస్థలు తప్పుగా ప్రసారం చేయుటముతో, మీడియాపై ప్రజలకు నమ్మకము లేకుండా పోతుందని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు చంద్రబాబు వారి గ్యాంగ్ వలన రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదని ఒక్కసారి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పని చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పోర్టులు, హార్బర్లు ,స్కూల్స్, హెల్త్ సెంటర్లు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణాలు జరిగాయని, ప్రజాసంక్షేమమైన అమ్మబడి, వైయస్సార్ ఆసరా, రైతు భరోసా వంటి సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలో తీసుకువచ్చారని అన్నారు మరి టిడిపి ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఎల్లో మీడియా అని అభివృద్ధి శూన్యమని, డబ్బాలు కొట్టుకోవడము తప్ప ఈ ప్రభుత్వం ఏమి చేయలేదని ఆయన విమర్శించారు. సోషల్ మీడియాలో మావిగన్ పై విమర్శలు చేస్తున్నారని, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. మహిళల పట్ల అనుచితముగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం చేసినందుకు ఎడిటర్ యాంకర్ పై కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *