పయనించే సూర్యుడు ఏప్రిల్ 11(జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రజల దాహాన్ని తీర్చడం కోసం చలివేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రజలు సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న వివిధ కార్యాలయాలకు కలెక్టరేట్కు పనుల మీద వస్తూ ఉంటారు. వేసవి ఎండలు చాలా తీవ్రంగా పెరిగిపోతున్న కారణంగా ప్రజలకు మంచినీరు అందించాల్సిన అవసరం బాధ్యత మున్సిపాలిటీ పై ఉన్నదని గుర్తించి మున్సిపల్ పాలకమండలి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు చలివేంద్రం ప్రారంభించామని ఇంకా పట్టణంలో జన సమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో మరికొన్ని చలివేంద్రాలను ప్రారంభించి ప్రజలకు మంచినీరు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల మన శరీరంలోని నీటి శాతం లవణాలు తగ్గి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటది కావున ప్రజలు విరివిగా మంచినీరు తీసుకొని వడదెబ్బలు తగలకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని పనుల మీద జనగామ కు వచ్చేవారు.ఉదయం పూట వచ్చి పనులు చూసుకోవాలని ఎండలో ఎక్కువగా సంచరించవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భూష పర్వతాలు కౌన్సిలర్లు బూడిది జ్యోతి రామగళ్ళ విజయ్ సేవెల్లి మధు బుక్క బాల భారద్వాజ్ గోపగోని సుగుణాకర్ ఆండాలు సందుపట్ల మంజుల పానుగంటి సువార్త సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి బీఆర్ఎస్ నాయకులు డి రాజు మామిడాల రాజు మున్సిపల్ మేనేజర్ గజ్జల రాములు మున్సిపల్ డి ఈ తోట రాజకుమార్ మల్లి గారి మధు పులి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.