బాధిత కుటుంబానికి రూ.50,000 తక్షణ సహాయం కంచి పరమేశ్వర్ రెడ్డి

పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) కంచి పరమేశ్వర రెడ్డి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం: చిత్తలూరులో బాధిత కుటుంబానికి రూ. 50,000 తక్షణ సహాయం చేజర్ల మండలం, చిత్తలూరు ఎస్సీ కాలనీ అపారమైన సేవా దృక్పథం, పేదల పట్ల ఆత్మీయత కలిగిన శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ .కంచి పరమేశ్వర రెడ్డి మరోసారి తన ఉదారత్వాన్ని చాటుకున్నారు. చేజర్ల మండలం చిత్తలూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్ధి హరికృష్ణ, సిద్ధి మురళీకృష్ణ అనే ఇద్దరు అన్నదమ్ములు మరణించడం అందరినీ కలిచివేసింది తక్షణ స్పందన ప్రమాద వార్త తెలియగానే దిగ్భ్రాంతి చెందిన పరమేశ్వర రెడ్డి శనివారం స్వయంగా వారు చిత్తలూరు ఎస్సీ కాలనీలోని మృతుల ఇంటికి చేరుకున్నారు ఆర్థిక తోడ్పాటు పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి భరోసా ఇస్తూ, ఒక్కొక్కరికి రూ. 25,000 చొప్పున మొత్తం రూ. 50,000 ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు ధైర్యం మీకు నేనున్నాను అంటూ కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి మనోధైర్యాన్ని కల్పించారు. నిరంతర సేవా పధంలో పరమేశ్వర రెడ్డి ఆ గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఆత్మకూరు ప్రాంతంలో పరమేశ్వర రెడ్డి చేస్తున్న సేవలు వర్ణనాతీతంఅన్న ప్రసాదం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మరియు వారి సహాయకులకు నిరంతరం ఆకలి తీరుస్తున్నారు. సామాజిక సేవ ఆపదలో ఉన్న పేదవారికి, విద్యా రంగంలో విద్యార్థులకు, మౌలిక సదుపాయాలకు ఆయన అందిస్తున్న సహకారం అజరామరం. ఉదార స్వభావం ఎక్కడ కష్టం ఉందని తెలిసినా తక్షణమే పరిష్కార మార్గాలను చూపడం వారి ప్రత్యేకత. గ్రామస్తుల ప్రశంసలు కనివిని ఎరుగని రీతిలో సామాజిక సేవ చేస్తూ, మా గ్రామానికి స్వయంగా విచ్చేసి ఆదుకున్న పరమేశ్వర రెడ్డి ఉదార హృదయానికి పాదాభివందనాలు. అని గ్రామ పెద్దలు మరియు ప్రజలు తమ కృతజ్ఞతలు చాటుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *