కార్మికుల ప్రాణాలతో చెలగాటమా : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

*రసాయన పరిశ్రమల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం . *నోస్ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ ను సందర్శించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం .

పయనించే సూర్యుడు న్యూస్ చిట్యాల ఏప్రిల్ 12. చిట్యాల మండలం వెలిమినేడు నోస్ పరిశ్రమ లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం అధికారుల చేత నివేదిక తప్పించుకొని యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని సిపిఐ పార్టీ ఎమ్మెల్సీ కంటి సత్యం డిమాండ్ చేశారు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధి చిట్యాల మండలం వెలిమినేడు సమీపంలోని నోస్ ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంపై శనివారం నాడు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సందర్శించి పరిశ్రమ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన రసాయన పరిశ్రమల్లో కొనసాగుతున్న నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాల లేమి, అధికారుల పర్యవేక్షణ లోపాలను బహిర్గతం చేసిందని అన్నారు. రసాయన పరిశ్రమలు లాభాపేక్షతో కనీస భద్రతా నిబంధనలను కూడా పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి ఉత్పత్తి కొనసాగించడం అమానుషమని, ఇది కేవలం నిర్లక్ష్యం కాకుండా నేరమని పేర్కొన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *