పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 11 ,తల్లాడ రిపోర్టర్ తల్లాడ గ్రామపంచాయతీలో సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు (చిన్నబ్బాయి )ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం సర్పంచ్ పదవి స్వీకరించినప్పటి నుండి తల్లాడ గ్రామపంచాయతీలోని సమస్యలను స్వయంగా పర్యవేక్షిస్తూ అభివృద్ధి పనులు చేస్తూ, గ్రామంలో నీటి ఎద్దడి తలెత్తకుండా, బోర్ల మరమ్మతులు, డ్రైనేజీలలో పూడిక తీయించడం, తల్లాడ రింగ్ రోడ్డు సెంటర్లో, కూడిక పోయిన పైపులను తొలగించడం, కొత్త పైపుల ఏర్పాటుకు చొరవ చూపడం, యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నారు, గ్రామ ప్రజలు తనకు ఓటు వేసినందుకు తన వంతు గ్రామాభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సర్పంచ్ తెలిపారు, ఆయనకు వెన్నుదన్నుగా ఉంటూ ఉపసర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి, గ్రామపంచాయతీ సిబ్బంది, అభివృద్ధి పనులలో దూసుకుపోతున్నారు,తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ ప్రజలు, సర్పంచ్ కార్యాచరణ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కృష్ణారావు, సురేందర్ రెడ్డి, వేలాద్రి, చాంద్, గ్రామ పంచాయత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.