సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ నేతృత్వంలో

అన్నారుగూడెంలో ఇందిరమ్మ గృహాల సర్వే ప్రక్రియ వేగవంతం

పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 11, తల్లాడ రిపోర్టర్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం అన్నారుగూడెం పంచాయతీలో సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ నేతృత్వంలో రెండవ విడత ఇందరమ్మ గృహాల సర్వే ప్రక్రియ వేగవంతం అయ్యింది. ఆమెరకు గురువారం సర్పంచ్ ప్రభాకర్ తానే స్వయంగా పంచాయతీ సిబ్బందితో స్థానికంగా ఉన్న గృహాలు సందర్శించి, గృహాల యొక్క స్థితిని, పరిసరాల ప్రభావతను తెలుసుకుంటున్నారు, నిర్మాణానికి యోగ్యమైన ఇంటి స్థలాన్ని పరిశీలించి, కుటుంబ ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకొని గృహాన్ని నిర్మించుకునేందుకు తగు అవకాశాలపై పంచాయతీ సెక్రెటరీ వెంకటేశ్వరావుతో కలిసి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సంబంధిత వార్డు మెంబర్, యువ నాయకులు రాచబంటి వంశీ, స్థానిక నాయకులు ఇస్నపల్లి శ్రీనివాసరావు, రాచబంటి సూరి, చందు, కొత్తూరి శ్రీనివాసరావు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *