అక్షయకల్ప డైరీ ఫామ్ నుంచి వెలువడుతున్న పొగ: స్థానికులలో పెరుగుతున్న ఆందోళన

* పొగలో ఉండే నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వల్ల శ్వాసకోశ వ్యాధులు ,కళ్లలో మంటలు,చర్మంపై దద్దుర్లు, వచ్చే అవకాశం * పొగ నియంత్రణకు అవసరమైన 'ఎయిర్ ఫిల్టర్స్' ఏర్పాటు చేయాలి_  స్థానికుల డిమాండ్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 14, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్ మండలం రాయపల్లి గ్రామంలో ఉన్న ‘అక్షయకల్ప’కు చెందిన డెయిరీ ఫామ్ నుండి భారీగా వెలువడుతున్న పొగ ఇప్పుడు స్థానిక ప్రజల ఆరోగ్యానికి కీడు చేసే విధంగా మారుతోంది. డెయిరీ ప్లాంట్లు వాళ్ళు సాధారణంగా బాయిలర్లు వ్యర్థాల దహనం కోసం చిమ్నీలను ఉపయోగిస్తారు.అయితే, ఈ పొగలో ఉండే నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ సూక్ష్మ ధూళి కణాలు గాలిలో కలవడం వల్ల శ్వాసకోశ వ్యాధులు,  చిన్నపిల్లలు, వృద్ధులలో ఆస్తమా, బ్రోన్కైటిస్ , ఇతర ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు , కళ్లలో మంటలు, చర్మంపై దద్దుర్లు వచ్చే ప్రమాదం తో పాటు రక్తపోటు పెరిగి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే  డైరీ ఫామ్ యాజమాన్యానికి తెలియజేసిన ఏ మాత్రం  స్పందించడం లేదనీ , స్వచ్ఛమైన పాలు తయారు చేస్తూ స్వచ్ఛమైన గాలిని కూడా కలుషితం చేస్తున్నారు అని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైన యాజమాన్యం తక్షణమే స్పందించి, పొగ నియంత్రణకు అవసరమైన ‘ఎయిర్ ఫిల్టర్స్’ ఏర్పాటు చేసి, సమస్యను పరిష్కరించాలని స్థానికులు చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు, డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *