
పయనించే సూర్యుడు ,ఏప్రిల్ 15, బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భూర్గంపాడు మండలం పాత సారపాక లో మంగళవారం రోజున ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, న్యాయవాది, ఆర్థిక వేత్త, గొప్ప సంఘ సంస్కర్త, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పాత సారపాకలో వెంకటరమణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సారపాక మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ధారావత్ చందు నాయక్ పాల్గొన్నారు. చందు నాయక్ మాట్లాడుతూ అంబేద్కర్ మన దేశానికి చేసినటువంటి సేవలను గుర్తు చేస్తూ రాజ్యాంగ నిర్మాణం, అంటరానితనం, కుల వివక్షత, మహిళా సాధికారత, సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ పోరాడి తన జీవితాన్ని త్యాగం చేశారని, అంబేద్కర్ అడుగుజాడల్లో విద్యా, ఐక్యత, క్రమశిక్షణ అనే నినాదంతో ప్రజలందరూ కలిసి అభివృద్ధి చెందిన భారత దేశాన్ని నిర్మించుకోవడానికి కోరుకుంటూ, ప్రజలకు తమ విలువైన ప్రసంగాన్ని తెలియజేయడం జరిగింది. అనంతరం వెంకటరమణ సేవాసమితి వ్యవస్థాపకురాలు దాసరి వెంకటరమణ మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందటం అంటే అద్దాలమేడలు, రంగు రంగుల గోడలు కాదు అని, పౌరుని నైతిక అభివృద్ధి నిజమైన దేశ అభివృద్ధి అని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు తెలియ జేస్తూ, మన మేజర్ గ్రామ పంచాయతీ అయిన సారపాక లో అంబేద్కర్ బారీ విగ్రహం లేక పోవడం అనేది చాలా బాధ కరమైన విషయం అని, రానున్న రోజులలో చందు నాయక్ సర్పంచ్ గా ఎన్నికైతే మీరు అంబేద్కర్ భారీ విగ్రహం పెట్టాలని, ఇది పంచాయతి లో ఉన్నటువంటి అందరి కల అని ఈ సందర్భంగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ సేవా సమితి సభ్యులు మానుపల్లి పవన్ కళ్యాణ్, దాసరి మోహన్ రావు, చెలికాని సాంబశివరావు, లేడా శ్రీను, చలికాని రమేష్, బుయ్యన శంకర్, కోడి రెక్కల రంజిత్, దారా కార్తీక్, పాత సారపాక మహిళలు తదితరులు పాల్గొన్నారు.