ఖానాపూర్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 (నిర్మల్ జిల్లా) ఖానాపూర్ పట్టణంలో డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ మరియు బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ ఆలోచనలు, రాజ్యాంగ విలువల ప్రాముఖ్యతపై మాట్లాడారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *