గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చెయ్యాలి

* టిడిపి క్లస్టర్ 2 కన్వీనర్ గాలి కృష్ణారావు

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 11 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సంపూర్ణ విజయాన్ని కైవసం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ పక్కా వ్యూహరచనతో సిద్ధమవుతోంది. క్షేత్రస్థాయిలో బూత్ కమిటీల నుండి పార్టీని పటిష్టం చేయడం, మరోవైపు ఎమ్మెల్యే గౌతు శిరీష నాయకత్వంలో సాధించిన అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం అనే ద్వంద్వ వ్యూహంతో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఉన్నత నాయకత్వం దిశానిర్దేశం చేసింది. పలాస టిడిపి కార్యాలయంలో శుక్రవారం జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో క్లస్టర్-2 కన్వీనర్ గాలి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశం లో గెలుపే ఏకైక లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గౌతు శిరీష, సమన్వయకర్త వెంకన్న చౌదరిల మార్గదర్శకత్వంలో ప్రతి వార్డులోనూ పక్కా ప్రణాళిక అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి యూనిట్, బూత్ కన్వీనర్లు తమ పరిధిలోని ఓటర్లతో మమేకమవ్వాలని, ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వ విజయాలను వారికి వివరించాలని సూచించారు. ప్రతి వార్డులోనూ పార్టీ జెండా ఎగరేయడమే లక్ష్యం. అధిష్టానం ఆదేశాలను శిరసావహించి, ప్రతి కార్యకర్త పనిచేయాలనీ, నాయకత్వం నిర్దేశించిన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విజయవంతం చేయడానికి అవసరమైన సమన్వయం చేసి, పార్టీ గెలుపులో కీలక పాత్ర పోసించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ఫలాలను ప్రతి గడపకూ చేరవేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని. స్థానిక నాయకత్వం యొక్క కృషికి రాష్ట్ర స్థాయి నుండి సంపూర్ణ సహకారం అందించి, రానున్న ఎన్నికలలో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో ఏఎంసీ చైర్మన్ మల్ల శ్రీనివాసరావు పట్టణ అధ్యక్షులు బడ్డ నాగరాజు , క్లస్టర్ కో కన్వీనర్ గురుటి సూర్యనారాయణ ,మల్లిపెద్ది చిన్ని,రవిశంకర్ గుప్తా,కోరికాన శంకర్రావు , సవర రాంబాబు ,జోగా మల్లేశ్వరరావు, కొవ్వూరు సురేష్ ,ఇప్పిలి చాణిక్య , గురుటి శివ, యూనిట్ కన్వీనర్ కో కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *