పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 11 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. విప్లవ సాంస్కృతిక ఉద్యమ దృవతార కానూరు వెంకటేశ్వరరావు అని అరుణోదయ సాంస్కృతి సమైక్య జిల్లా అధ్యక్షులు సొర్ర రామారావు కొనియాడారు పలాస మండలం చిన్న నీలావతిలో కామ్రేడ్ కానూరి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి రామారావు ముందుగా పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు అమర కళావేత్త లకు జోహార్లు అర్పించారు కామ్రేడ్ కానూరి అరుణోదయ సాంస్కృతి సమైక్య వ్యవస్థాపకుడు 99 సంవత్సరాల వయసులో 2015లో అమరుడయ్యారు తన జీవితాంతం కళారంగానికి అంకితమయ్యాడు రాజ్యానికి వ్యతిరేకంగా కలలను అమ్ముకొని బతుకుతున్న కాలంలో కళ ప్రజల కోసం శ్రామిక జన విముక్తి కోసం అంకితమై ప్రజల పక్షం వహించి ఆటపాట మాట ద్వారా ఆయన ప్రజలకు అంకితమై విప్లవ సాంస్కృతికోద్యం ధ్రువతారగా నిలిచారని రామారావు కొనియాడారు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు మాట్లాడుతూ కానూరు తాత సుబ్బారావు పాణిగ్రాహి తామర చినబాబు అరుణోదయ రామారావు వంటి అమరకళావేతలు ప్రజల పక్ష వహించారు నేటి దేశంలో ఫాశిష్ట ప్రమాదం పొంచి ఉంది సామ్రాజ్యవాద విస్తరణలో భాగంగా మూడో ప్రపంచ దేశాల పైన ఈరోజు ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ సామ్రాజ్యవాదం చేస్తున్న యుద్ధాన్ని ఖండించాలని కళాకారులు కవులు మేధావులు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ప్రజల పక్షాన వహించాలని ఫాస్టెస్ట్ ప్రమాదానికి వ్యతిరేకంగా కళాలను గలాలను విప్పాలని ప్రజల పక్షాన నిలబడిన వాళ్లే నిజమైన ప్రజా కళాకారులు ఆ కోవలో కామ్రేడ్ కానూరు వస్తారని ఆయన అన్నారు ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు జుట్టు వీరాస్వామి ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వంకల పాపయ్య మురిపిండి తాతారావు ప్రగతిశీల కార్మిక సమైక్య జిల్లా కార్యదర్శి పుచ్చ దుర్యోధన పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వినోద్ తదితరులు పాల్గొన్నారు