దౌల్తాబాద్ మండలం కోనాపూర్ గ్రామంలో నీటి సమస్యల పరిష్కారానికి కీలక చర్యలు

నీటిసమస్యలపై చర్యలు తీసుకుంటున్న ఆర్డబ్ల్యూఎస్ శాఖ మరియు సర్పంచ్ రుక్మిణి"

పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్ మండలంలోని కోనాపూర్ గ్రామంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈరోజు ముఖ్యమైన పరిశీలన కార్యక్రమం నిర్వహించబడింది. స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు చెందిన ఎస్.ఈ., డి.ఈ., ఏ.ఈ.లు మరియు మిషన్ భగీరథ సిబ్బంది గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న నీటి సరఫరా పరిస్థితులను అధికారులు సమగ్రంగా పరిశీలించారు. ముఖ్యంగా గ్రామంలో నెలకొన్న వాటర్ సమస్యలు, బెడ్‌రూమ్ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం అవసరం, అలాగే 60 కే.ఎల్ సామర్థ్యం గల నీటి ట్యాంక్ పరిస్థితిని వారు పరిశీలించారు. అధికారులు ట్యాంక్ మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, వెంటనే అంచనాలు (ఎస్టిమేట్లు) సిద్ధం చేయాలని ఏఈకు ఆదేశాలు జారీ చేశారు. ట్యాంక్‌ను తక్షణమే రిపేర్ చేయించి గ్రామ ప్రజలకు నిరంతరంగా శుద్ధి చేసిన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రుక్మిణి రాజిరెడ్డి, ఉపసర్పంచ్ రాజు, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి అధికారులు తీసుకున్న ఈ చర్యలను స్థానికులు అభినందించారు. గ్రామంలో నీటి సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న ఈ చర్యలు త్వరలోనే ఫలితాలు ఇస్తాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *