ఏబీవీపీ జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ ఎస్ ఎఫ్ డి కో కన్వీనర్ గోస్కుల అజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితం, ఆయన చేసిన సేవలు, సమాజానికి అందించిన విలువల గురించి స్పష్టంగా వివరించారు. అంబేద్కర్ సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ప్రాముఖ్యత, సమానత్వం వంటి అంశాలను ఆచరణాయుతంగా రాజ్యాంగ నిర్మాణం లో నిలిపారని.అదేవిధంగా, అంబేద్కర్ ఆశయాలను యువత ముందుకు తీసుకువెళ్లాలని ఆ బాధ్యత మన అందరిపై ఉందని సూచించారు. యువత సమాజంలో మార్పు తీసుకురావడానికి అంబేద్కర్ ఆశయాలను సాధించడానికి ముందుకు సాగుతూ సమాజానికి మార్గదర్శకంగా నిలవాలి అని అన్నారు.డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ గారు ఎప్పుడూ ఈ దేశానికి విరుద్ధంగా ఉండలేదని, ఆయన దేశ అభివృద్ధి, రక్షణ, సమానత్వం మరియు సమగ్రత కోసం కృషి చేశారని కుల వివక్షత లేని సమాజాన్ని స్వప్నించారనీ నిబద్ధతతో కూడుకున్న సమాజాన్ని రాజ్యాంగం ద్వారా సాధించాలని ఆశించారు ఆ బాటలో సాగాలని వివరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి పాలిక నిరూప్ నగర సంయుక్త కార్యదర్శి ఆరిఫ్ నగర ఉపాధ్యక్షులు రోహిత్, ఆఫ్రిడ్, రామ్ చరణ్, మరియు విద్యార్థులు పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *