దళితులే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలన్న అంబేద్కర్ కలలను నిజం చేద్దాం

అంబేద్కర్ 135 వ జయంతి సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఐ చరమంద రాజు

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 18 నేరెడుచెర్ల మండల ప్రతినిది (చింతల శ్రవణ్) సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో అంబేద్కర్ మహాశయుని 135వ జయంతి కార్యక్రమాన్ని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన అనంతరం బహిరంగ సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉంటారో వారే దళితులని దళితులే రాజ్యాధికారాన్ని చేపట్టాలన్న అంబేద్కర్ మహాశయుని కలలను నిజం చేసేందుకు అందరూ కంకణ బద్ధులు కావాలని, అన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అంబేద్కర్ మహాశయుని పుణ్యమే అని ఆయన రాసిన ఆర్టికల్ 3 వల్ల నే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రిజర్వేషన్లు అనేది అంబేద్కర్ కల్పించినవేనని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించింది కూడా అంబేద్కర్ అనే విషయాన్ని అందరూ గుర్తించాలని రిజర్వేషన్ అనేది విద్య కొరకు ఉద్యోగుల కొరకు రాజకీయాల కొర కుఅయితే రాజకీయాలకు మాత్రమే పరిమితి ఉంటుందని విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లకు పరిమితి లేదని వారు అన్నారు సభకు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీన రాపోల్ నవీన్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఐ చరమందరాజు, తాసిల్దార్ సురిగి సైదులు, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయనాయుడు, బిజెపి జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత, కౌన్సిలర్లు దొండపాటి అప్పిరెడ్డి, ఎస్ కె హుస్సేన్, ఎస్ కే ఖలీల్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు పారేపల్లి శేఖర రావు, జనసేన జిల్లా అధ్యక్షుడు సరికొప్పుల నాగేశ్వరరావు, పెరుమాళ్ల సతీష్, పల్లెపంగ నాగరాజు, రామ్, సైదులు, జింకల భాస్కర్, చిలక రాజు శ్రీను, కొమర్రాజు వెంకట్, బాల వెంకటేశ్వర్లు, ఎస్సై రవీందర్ నాయక్, అవిరేండ్ల నాగేందర్, దిర్శంచర్ల సర్పంచ్ బుర్రి శ్రీనివాస్, అబ్రహం, పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *