ఘనముగా అంబేద్కర్ జన్మదిన వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 15 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకలు దళిత హక్కుల పరిరక్షణ సమితి పలాస మండల శాఖ .కాశీబుగ్గ ఓల్డ్ బస్టాండ్ లో గల అంబేద్కర్ విగ్రహo వద్ద జన్మదిన వేడుకలు ఘనముగా మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటగా దళిత హక్కుల పరిరక్షణ సమితి గౌరవాధ్యక్షుడు పిలక కృష్ణారావు, జడ్పీహెచ్ఎస్ కాశీబుగ్గ ప్రధానోపాధ్యాయుడు చిన్నమనాయుడు గురుబెల్లి సత్యనారాయణచే పతాకావిష్కరణ చేశారు. అంబేద్కర్ ప్రతిమకు మొదటగా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాస్ తో పాటు దళిత హక్కుల పరిరక్షణ సమిత అధ్యక్షులు తెప్ప పాపారావు, పూలమాల అలంకరణ చేశారు. తదుపరి ఈ కార్యక్రమంలో బేరి అప్పారావు మాస్టర్ నగిరి తారక పూర్ణాన అప్పలరాజు ,కోనపల్లి రవికుమార్, తుంగనశంకర్ పద్మలోచన, మాస్టారు, దుర్యోధన మాస్టారు,ఆదివాసి హక్కుల సంఘం అధ్యక్షులు జగన్ నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మీసాల సురేష్ బాబు, అంబుసోలి యువకులు సిహెచ్ రామకృష్ణ . దేవ, దేవరాజు,సంజీవరావు, బోనాల ప్రవీణ్ తారకేశ్వరరావు, రైల్వే ఎస్సీ ఎస్టీ సంఘ సభ్యులు గిరి బోనెల కృష్ణారావు మట్ట రామకృష్ణ , బోనెల రమణారావు పాల్గొన్నారు.అనంతరo ప్రజా సంఘాల  ప్రతినిధులు సిఐటియు  జిల్లా కార్యదర్శి నెయ్యల గణపతి, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ,మండల  సీనియర్ కార్యకర్తలు స్థానిక నాయకులు పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *