గాలిపెల్లి ఉప మండల హిందూ సమ్మేళన నిర్వహణ సమితి నియామకం

పయనించే సూర్యుడు న్యూస్ : ఏప్రిల్ /10 :నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం లోని గాలిపెల్లి ఉప మండల కేంద్రంలోని హరి హర దేవాలయం ఆవరణలో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహణకు సంబంధించి వివిధ గ్రామాల నుండి వచ్చిన సభ్యులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఖండ జాగరణ సమితి సభ్యులు బత్తిని ఆంజనేయులు, కాసుపాక కిషన్ పాల్గొన్నారు. ఉప మండలంలోని ఐదు గ్రామాల నుండి కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. హిందూ సమ్మేళనం విజయవంతంగా నిర్వహించేందుకు హిందూ సమ్మేళన నిర్వహణ సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమితి అధ్యక్షుడిగా గాలిపెల్లి గ్రామానికి చెందిన మల్లు గారి దేవేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కోమటిరెడ్డి శ్రీనివాస్, కోశాధికారిగా అయ్యన్న గారి హరికృష్ణ రెడ్డి, ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు మల్లు గారి దేవేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు, కార్యదర్శులు మరియు ఇతర కార్యవర్గ సభ్యులను నియమించారు. ఈ నెల 19వ తేదీ, ఆదివారం ఉదయం 9:00.గంటలకు హరి హర దేవాలయంలో హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన నిర్వహణ సమితి సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *