పయనించే సూర్యుడు న్యూస్ : ఏప్రిల్ /10 :నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం :కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం లోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారాలు కొనసాగిస్తున్నాయని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వం పల్లి సత్యనారాయణ అన్నారు.
గురువారం శంకరపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో సీఎంఆర్ఎఫ్, కల్యాణ లక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని అయితే ఈ పథకాలపై ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోయి దుష్ప్రచారాలకు ఒడిగట్టాయని ఆయన విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్త రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చిన పాపాన పోలేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడకం దారులకు ఉచిత విద్యుత్తు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, సన్నవడ్లకు 500 బోనస్, రైతు భరోసా పథకాల ప్రభుత్వం అమలు చేస్తుండడంతో ప్రతిపక్షాలకు మింగుడు పడక దుష్ప్రచారం కొనసాగిస్తున్నాయని, వీటిని ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు తిప్పి పట్టాలని ఎమ్మెల్యే కోరారు. రహస్య ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నప్పటికీ ఆదాయ మార్గాలను అన్వేషించుకుంటూ సంక్షేమ పథకాలను అమలు చేసి తీరుతామని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇప్పటివరకు 24 విడతల్లో చెక్కులు పంపిణీ చేశామని, 24వ విడతలో 102 మంది లబ్ధిదారులకు 28 లక్షల 21 వేలు మంజూరు, కాగా వాటిని చెక్కుల రూపంలో పంపిణీ చేస్తున్నట్టు ఎమ్మెల్యే వివరించారు. అలాగే 91 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో శంకరపట్నం తాసిల్దార్ కే సురేఖ, ఎంపీడీవో కృష్ణ ప్రసాద్, మాజీ జడ్పిటిసి, పిసిసి సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్,శంకరపట్నం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోపగాని బస్వాగౌడ్, ఏఎంసి వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, కొత్తగట్టు టెంపుల్ చైర్మన్ కోరం రాజిరెడ్డి,పార్టీ నాయకులు ఉప్పుగళ్ల మల్లారెడ్డి, బండారు తిరుపతి, కవ్వ పద్మ, చింతరెడ్డి పద్మ, దుర్గం తిరుపతి, గొట్టె మధు ఊకంటి మధుకర్, ఉప్పుగళ్ల మల్లారెడ్డి, కోరం రాజిరెడ్డి, ఎగ్గని రమేష్, తాటికొండ సదానందం, నేరెళ్ల సంతోష్, ఆడెపు అజయ్ షారుక్, ఇషాముద్దీన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ భవనం ప్రారంభం శంకరపట్నం మండలం గుడాడి పల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి కేంద్రం భవనాన్ని గురువారం మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు.