పల్లె వీక్షణ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) నెల్లూరు జిల్లాలో పల్లె వీక్షణ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆత్మకూరు మండలం నబ్బీ నగరం, బోయిల చిరువెళ్ల గ్రామాల నుంచి పల్లె వీక్షణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా. బుధవారం ఉదయం నుంచి జిల్లా అధికార యంత్రాంగం ఆత్మకూరు ఆర్డీవో బి.పావని స్థానిక అధికారుల తో కలిసి నబ్బీ నగరం, బోయిల చిరువెళ్ల గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ బోయిల చిరువెళ్లలో రైతు సేవా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్, అంగన్వాడీ కేంద్రం, హౌసింగ్ కాలనీ, మినీ గోకులం సందర్శించిన కలెక్టర్ నబ్బీనగరం గ్రామంలో ఉపాధి హామీ పనుల వద్దకు నేరుగా వెళ్లి కూలీలతో మాట్లాడిన కలెక్టర్ బోయిల చిరివెళ్ల గ్రామంలోని వీధుల్లో నడుచుకుంటూ ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి, స్థానిక అధికారుల పని తీరుపై స్వయంగా ఆరా తీసిన కలెక్టర్ అనంతరం వారు మాట్లాడుతూ. ప్రతివారం ఒక గ్రామంలో అధికార యంత్రాంగం తో కలిసి సమగ్రంగా పర్యటించి నేరుగా ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమమే పల్లె వీక్షణ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని కూడా సమీక్షిస్తాం. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకుంటాం ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అమలవుతున్నాయా. గ్రామస్థాయిలో అధికారుల పనితీరు ఎలా ఉంది.లోటుపాట్లను లోతుగా తెలుసుకుంటాం గ్రామంలో ప్రతి సమస్యకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా పల్లె వీక్షణ కలెక్టర్ అని తెలిపారు ఆయన వెంట అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *