
పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 11 జగ్గయ్యపేట పట్టణంలో ని ఈరోజు న: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ అమరావతికి వచ్చే మొట్టమొదటి ముఖద్వారం జగ్గయ్యపేట పట్టణమని , అమరావతికి కీలకమైన జగ్గయ్యపేటను అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. మున్సిపల్, సచివాలయ సిబ్బందితో ఆత్మీయ సమావేశాన్ని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంధ్ర అధ్యక్షతన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ నెట్టెం శ్రీ రఘురామ్ లతో కలసి జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ…..రాబోయే 40 ఏళ్ల పాటు జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను, తాగునీటి ఎద్దడి లేకుండా పక్కా వ్యవస్థను జగ్గయ్యపేటలో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. పట్టణ అభివృద్ధికి ప్రభుత్వ తోడ్పాటుతో పాటుగా ఊరి మీద ప్రేమ ఉన్న నాయకుల సహకారం తోడవడంతో జగ్గయ్యపేట రూపురేఖలు మారబోతున్నాయని వివరించారు. అమరావతి అంటే కేవలం 33 గ్రామాలు మాత్రమే కాదని, జగ్గయ్యపేట నుంచి మచిలీపట్నం వరకు విస్తరించిన ఒక చారిత్రాత్మక ప్రాంతమని స్పష్టం చేశారు . మూడు రాజధానుల పేరుతో గత ప్రభుత్వం చేసిన ప్రయోగాలు జగ్గయ్యపేట ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నాయని విమర్శించారు . ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జగ్గయ్యపేట సమస్యలను పరిష్కరించేందుకు నిధులు కేటాయించేందుకు సానుకూలంగా ఉందని తెలిపారు అమరావతి పరిధిలో మొట్టమొదటి పారిశ్రామిక పట్టణంగా జగ్గయ్యపేటను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం అన్నారు . త్వరలోనే ఇక్కడ ఒక భారీ డిఫెన్స్ క్లస్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని , దీనివల్ల స్థానిక యువతకు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే భారీ జీతాలతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్‌కు అత్యధిక ఆదాయం వస్తున్న ప్రాంతాల్లో జగ్గయ్యపేట ఒకటని, ముఖ్యంగా గూడ్స్ రవాణా ద్వారా భారీ రాబడి సమకూరుతోందని తెలిపారు. ప్యాసింజర్ రైళ్లు లేకపోవడం పెద్ద లోటుగా ఉందని, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు అనుసంధానంగా ప్యాసింజర్ రైలు నడిపేలా రైల్వే అధికారులతో మాట్లాడి కృషి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) హామీ ఇచ్చారు మహిళల ఆర్థికాభివృద్ధి కోసం జగ్గయ్యపేటలో ప్రత్యేకంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సింగపూర్, ముంబై వంటి నగరాల నుంచి నిపుణులను రప్పించి వినూత్న కోర్సుల్లో మహిళలకు శిక్షణ ఇస్తామని, ప్రతి బ్యాచ్‌లో 40 మందికి అవకాశం కల్పిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా పక్షపాతి అని, రాబోయే రోజుల్లో రాజకీయాల్లోనూ వారికి 33% రిజర్వేషన్లు అమలవుతాయని గుర్తుచేశారు గత ప్రభుత్వ హయాంలో జగ్గయ్యపేటలో కనీసం ఒక తట్ట మట్టి కానీ, రాయి కానీ వేసిన పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు . అధికారులకు, రాజకీయ నాయకులకు అపాయింట్‌మెంట్లు దొరకడమే కష్టంగా ఉండేదని, కేవలం ‘దాచుకోవడం – దోచుకోవడం’ అనే విధానమే సాగిందని ఆరోపించారు . 20 ఏళ్లుగా పేరుకుపోయిన చెత్త సమస్యను సైతం తాము స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా పరిష్కరిస్తున్నామని వివరించారు . రాబోయే మూడు నెలల్లో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, ఇతర పనులన్నీ పూర్తి చేసి, 100 శాతం స్ట్రైక్ రేట్‌తో జగ్గయ్యపేటలో మళ్లీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు మున్సిపల్ సిబ్బంది, ఉద్యోగుల సమస్యల పరిష్కారంకు చర్యలు చేపడతామని, ఉద్యోగులకు టిడిపి కూటమి ప్రభుత్వంలో ఉన్నంత భద్రత ఎక్కడా ఉండదన్నారు. జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ మల్లెల సీతమ్మ, మాజీ మున్సిపల్ ఛైర్మన్ శ్రీరాం సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్ తులసి కృష్ణారావు, పట్టణ టిడిపి అధ్యక్షులు మేకా వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు నూకల కుమార్ రాజా, మున్సిపల్ కౌన్సిలర్లు, పీఏసీఎస్ డైరెక్టర్లు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.