జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు గాంధారి 12/04/26 జాతీయ బిసి సంక్షేమ సంఘం గాంధారి మండల శాఖ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 199వ జన్మదిన వేడుకలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం గాంధారి కార్యాలయంలో జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా గాంధారి మండల బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే 11 ఏప్రిల్ 1827న మహారాష్ట్రలో జన్మించారని ప్రజలకు ఉచిత విద్యను అందించారని సత్యశోధక సమాజాన్ని స్థాపించి అంటరానితనం నిర్మూలనకు సమసమాజ స్థాపనకు కృషి చేశారని నేడు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఎం జె పి గురుకులాల స్థాపన జరిగిందని కొనియాడారు జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు గాంధారి ప్రభుత్వ ఆరోగ్య ఆసుపత్రిలో డాక్టర్ తో కలిసి రోగులకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేశారు అనంతరం గాంధారి మండలానికి కొత్తగా వచ్చిన ఎస్ఐ మహేందర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం గాంధారి మండల అధ్యక్షులు నేరెళ్ల సంతోష్, ఉపాధ్యక్షులు చీమలవార్ శ్రీనివాస్, సెక్రటరీలు నస్కంటి రవి, సామల రాజు, టౌన్ ఉపాధ్యక్షులు తాటిపాముల శివకుమార్, సెక్రటరీలు ఆరెకటిక మోతిలాల్, తూర్పు రమేష్, యూత్ అధ్యక్షులు సిందే నితిన్ కుమార్, ఉపాధ్యక్షులు పనకంటి నవీన్, సెక్రటరీ తాటిపాముల సత్యం, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆకుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *