పర్వతాపురం రోడ్డుకు నిర్మాణానికి భూమి పూజ30 లక్షలతో బి టి రోడ్డు నిర్మాణం.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్. పట్టణలోని 37వ వార్డు లోని పర్వతాపురం గ్రామానికి వెళ్లే రోడ్డు అభివృద్ధికి 30 లక్షలు నిధులతో పనులు ప్రారంభించినట్లు మున్సిపల్ కమిషనర్ నహిమ్ అహ్మద్ తెలిపారు. గురువారం ఆ పనులకు కూటమి నాయకులతో కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి పర్వతాపురంకు వెళ్లి దారి శిథిలమై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయాన్ని గుర్తించిన శాసనసభ్యులు పీవీ పార్థసారధి అధికారులతో 15 వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా ఎస్టిమేషన్ వేయించి ప్రత్యేక చొరవ చూయించి నిధులు మంజూరు కేటాయింపు చేయించారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప, జనసేన పట్టణ అధ్యక్షుడు రేణు వర్మ, బిజెపి పట్టణ అధ్యక్షులు నాగార్జున, బిజెపి సీనియర్ నాయకులు లోకేష్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, సుబ్రహ్మణ్యం, వీరప్ప, జనసేన నాయకులు ఉరుకుందు శ్యామ్ మున్సిపల్ అధికారులు సత్యనారాయణ, రామ్మూర్తి, భువన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *