ముదిరాజ్ హక్కుల కోసం ఆందోళన – మత్స్యశాఖ నిధులపై విచారణ డిమాండ్,

ముందస్తు అరెస్టులపై ఆగ్రహం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ మత్స్యశాఖ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని ముదిరాజ్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని తుమ్మల అల్లోజి ముదిరాజ్ విమర్శించారు. బీసీ-డి నుంచి బీసీ-ఏగా వర్గీకరణ, ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు, కోకాపేటలో ఆత్మగౌరవ భవనం నిర్మాణం వంటి హామీలు ఇంకా అమలులోకి రాలేదని అన్నారు. కోకాపేట భూమిపై ఉన్న ట్రస్ట్‌ను రద్దు చేసి ముదిరాజ్ జాతికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న “హల్లో ముదిరాజ్ – ఛలో గాంధీ భవన్” కార్యక్రమానికి బిజినాపల్లి మండలం నుంచి బయలుదేరిన వారిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. హక్కులు అడిగితే అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇలాంటి విధానాలకు ప్రజలు ఎన్నికల్లో తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, సంగం నాయకులు బాలస్వామి పిట్టల తిరుపతయ్య కృష్ణయ్య మండల సంఘం సభ్యులు గంగరమొని శివ నరసింహ కావలకుందేళ్ళ రాజు వెంకటేష్ జంగయ్య సాయి స్థాయి నాయకులు ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *