సామాన్యుడికి 35 లక్షలకే డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అందుబాటులో సిరి పద్మావతి హైట్స్..

పయనించే సూర్యుడు ఏప్రిల్ 11, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) సామాన్యులకు కేవలం 35 లక్షల రూపాయలకే రెండు బెడ్ రూమ్లతో కలిపి1000 స్క్వేర్ ఫీట్స్ తో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయని సిరి పద్మావతి హైట్స్ మేనేజింగ్ డైరెక్టర్ దాట్ల సుబ్బరాజు అన్నారు. శుక్రవారం కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం రాయుడు వారి పాలెం వద్ద గల మూడో ఏపీఎస్పీ రిటైర్డ్ పోలీసు సంక్షేమ సంఘం భవనం లో ఏర్పాటుచేసిన సిరి పద్మావతి హైట్స్ బ్రోచర్ ను సంఘ సభ్యులు ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మూడవ ఏపీఎస్పీ రిటైర్డ్ సంక్షేమ సంఘం అసోసియేషన్ అధ్యక్షులు డివి సత్యనారాయణ, కార్యదర్శి జి నరసింహమూర్తి మరియు ట్రెజరర్ సిహెచ్ ఎస్ ఎన్ రాజు లు మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేసిన డి ఎస్ ఎన్ రాజు కుమారుడు అయిన దాట్ల సుబ్బరాజు ఎంతో అభిమానంతో తక్కువ ధరకే సామాన్యులకు అందుబాటులో ఉండేందుకు కిరణ్ కంటే ఆసుపత్రి వద్ద నూతనంగా సిరి పద్మావతి హైట్స్ వెంచర్ను ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు. ఇది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కేవలం 35 లక్షల కే 1000 స్క్వేర్ ఫీట్స్ తో అందించడం జరుగుతుందని అన్నారు. అనంతరం మేనేజింగ్ డైరెక్టర్ దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఇప్పటికీ కాకినాడలోని సురేష్ నగర్ ,సిద్ధార్థ నగర్ లో 9 వెంచర్స్ వేసామని రాజీలేని నాణ్యత పరిమాణాలతో ముందుకు వెళ్తున్నామని ఇలాంటి అవకాశాలు సద్వినియోగం చేసుకుని నాకు ప్రోత్సహించాలని పోలీస్ శాఖ అంటే నాకు అభిమానం అని ఇలాంటి అవకాశాన్ని సద్విని చేసుకుంటారని ఆశిస్తున్నానని వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పోలీస్ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *