ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

నివాళులర్పించిన మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 12 మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్,ఈరోజు మంథని పట్టణంలో గాంధీ చౌక్ లో ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సంబంధించి వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమన్నీ ఉద్దేశించి నాయకులు మండల పార్టీ అధ్యక్షులు అయిలి ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న,ఎలక్ట్రిసిటీ బోర్డ్ మెంబర్ శశిభూషణ్ కాచే,ఆర్టిఏ మెంబెర్ మంథని సురేష్,కౌన్సిలర్ ఎరుకల స్రవంతి రమేష్ బాబు,మాజీ సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్,వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్,సర్పంచ్ జాడి రామస్వామి, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం,బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ జీ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీమ్ ఖాన్,ఆకుల కిరణ్ యూత్ కాంగ్రెస్ మాజీ మండల యూత్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మంథని రాకేష్,మాజీ ఎంపిపి కొండ శంకర్,యూత్ కాంగ్రెస్ నాయకులు డిగంబర్ మాట్లాడుతూ భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా,మహిళా విద్య మరియు సమానత్వం కోసం పోరాడిన అగ్రగామి మహాత్మా జ్యోతిరావు ఫూలే. అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, సత్యశోధక సమాజ స్థాపకునిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ నాయకత్వంలో బిసి డిక్లరేషన్ బిల్లును 100% దానిని ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని
అన్నారు.విద్యే ఆయుధం విద్య లేకపోతే మతి పోతుంది, మతి లేకపోతే నీతి తప్పుతుంది, నీతి లేకపోతే గతి తప్పుతుంది” అని నమ్మిన వ్యక్తి ఫూలే. సమాజంలో మార్పు కేవలం విద్య ద్వారానే సాధ్యమని ఆయన చాటిచెప్పారనీ నాయకులు అన్నారు. మహిళా విద్యకు నాంది 1848లో పూణేలో బాలికల కోసం దేశంలోనే మొదటి పాఠశాలను ప్రారంభించరనీ, తన భార్య సావిత్రిబాయి ఫూలేను విద్యావంతురాలిని చేసి, ఆమెను దేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదే.1873లో ‘సత్యశోధక సమాజ్’ను స్థాపించి, సామాజిక సమానత్వం, హేతువాదం మరియు కుల నిర్మూలన కోసం బలమైన పునాదులు వేశారు.రైతుల పక్షపాతి రైతుల కష్టాలను, వారిపై జరుగుతున్న దోపిడీని నిరసిస్తూ ఆయన అనేక పోరాటాలు చేశారు. ఆయన రాసిన ‘గులాంగిరి’గ్రంథం అణచివేతకు వ్యతిరేకంగా ఒక గొప్ప సామాజిక ఆయుధంగా నిలిచింది.సమాజానికి ఆయన చేసిన అసమాన సేవలను గుర్తించి 1888లో ప్రజలు ఆయనకు ‘మహాత్మా’ అనే బిరుదును ప్రసాదించారు.”దళిత, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడటమే కాకుండా, సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన ఫూలే ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం. ఆయన వేసిన బాటలోనే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి మహనీయులు సామాజిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లారు.అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే. దేశాభివృద్ధికి మహిళా ఫూలే ఆశయ సాధనే లక్ష్యం.సామాజిక విప్లవ యోధుడు మహాత్మా ఫూలేకు ఘన నివాళి అర్పించారు. పుట్ట మధు విగ్రహాలకు మాలలు వేయడం లేదు గౌరవించడం లేదని మాట్లాడుతున్నావ్ మేము విగ్రహాల మాలలు వేస్తే మీ శ్రీధర్ బాబు ఏర్పరచుకున్న విగ్రహాల మాలలు వేసుకోవాలని చెప్పి కుల చిచ్చు పెట్టుకుంటూ ఎదిగాలనే చూస్తే ఇక్కడ ఎవరు ఊరుకోరని నీకు తగిన బుద్ధి మంథని ప్రాంత ప్రజలందరూ చెబుతూనే ఉన్నారు అయినా కూడా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావ్ ఖబర్దార్ పుట్ట మధు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, సర్పంచులు,ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *