
పయనించే సూర్యుడు ఏప్రిల్ 15, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, ఎం.ఎస్.ఎన్ క్యాంపస్‌లో వాణిజ్య మరియు నిర్వహణ అధ్యయన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “తలాష్ 2కె 26” రాష్ట్ర స్థాయి ఫెస్ట్ ఘనంగా ప్రారంభమైంది. విద్యార్థుల ప్రతిభ, నాయకత్వ నైపుణ్యాలు, సృజనాత్మకతను వెలికి తీయడమే ఈ మహోత్సవ లక్ష్యం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తోట సుబ్రహ్మణ్యం మేనేజింగ్ డైరెక్టర్, ఎలైట్ నేచురల్ ఆయిల్స్ & ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్, యువతలో ఆత్మవిశ్వాసం, స్టార్టప్ ఆలోచనలు మరియు ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రాముఖ్యతను వివరించారు. ఆయన ప్రసంగం విద్యార్థుల్లో కొత్త దారులు ఆలోచించేలా ప్రేరణనిచ్చింది. విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్. ప్రసన్న స్రీ తమ ప్రసంగంలో నేటి కాలంలో మేనేజ్‌మెంట్ భావన ఎలా మారిపోయిందో స్పష్టంగా వివరించారు. “మేనేజ్‌మెంట్ అంటే కేవలం లెక్కలు, స్ప్రెడ్‌షీట్లు మాత్రమే కాదు; అది ఒక సమగ్ర వ్యవస్థ. సంస్థలోని ప్రతి విభాగాన్ని సమన్వయం చేస్తూ, ప్రతి అంశాన్ని కలిపి ముందుకు నడిపించే ప్రక్రియే మేనేజ్‌మెంట్” అని ఆమె పేర్కొన్నారు. అలాగే నేటి మేనేజ్‌మెంట్ టి షాప్ మోడల్ ల ఉందని వివరించారు. అందులో పై గీత సమగ్ర దృక్పథం, సమన్వయం, వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతీక కాగా, కింది గీత గ్రౌండ్ లెవెల్‌లో పనిచేసే నైపుణ్యాలు, ప్రాక్టికల్ అవగాహనకు సంకేతమని తెలిపారు. ఈ రెండు సమన్వయంతోనే సమర్థవంతమైన నాయకత్వం సాధ్యమవుతుందని ఆమె వివరించారు. అదేవిధంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. ప్రశాంతి శ్రీ అధ్యక్ష ప్రసంగంలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. వాలెడిక్టరీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెడికవర్ సెంట్రల్ మేనేజర్ డా. అంజిబాబు మాట్లాడుతూ , యువత సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని, క్రమశిక్షణతో ముందుకు సాగాలని ప్రేరేపించారు. ఈ కార్యక్రమం కి విచ్చేసిన వివిధ కళాశాలల విద్యార్థులకి, అధ్యాపకులకు అలాగే ఏ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి సహకారం కలిపించిన అధ్యాపకులకు క్యాంపస్ విద్యార్థులకు ప్రోగ్రామ్ కన్వీనర్ డా. ఎల్. మధుకుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఫెస్ట్‌లో వివిధ అకడమిక్, మేనేజ్‌మెంట్ ఈవెంట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడగా, రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. “తలాష్ 2కె 26” విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టే వేదికగా నిలిచింది.