ఇల్లంతకుంటలో హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఏర్పాటు.

పయనించే సూర్యుడు న్యూస్ : ఏప్రిల్ /13 :నియోజకవర్గం స్థాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం లోని ఇల్లంతకుంట ఉప మండల కేంద్రంలోని స్థానిక వాణినికేతన్ హైస్కూల్ ఆవరణలో హిందూ సమ్మేళనం నిర్వహణకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ గ్రామాల నుండి కార్యకర్తలు హాజరయ్యారు. ఖండ జాగరణ సమితి సభ్యులు ఎలిగేటి వంశీ, బత్తిని ఆంజనేయులు, కాసుపాక కిషన్, ఎగుర్ల శ్రీనివాస్, తాటిపల్లి మహేష్ సమావేశంలో పాల్గొన్నారు. ఉప మండలంలోని 7 గ్రామాలకు చెందిన కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొని హిందూ సమ్మేళనం నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా హిందూ సమ్మేళనం నిర్వహణ కోసం ప్రత్యేక సమితిని ఏర్పాటు చేశారు. సమితి అధ్యక్షుడిగా తూముకుంట మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఈదుల రవీందర్ రెడ్డి, కోశాధికారిగా నార్ల రాంకిషన్‌, ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు తూముకుంట మోహన్ రెడ్డి ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను నియమించారు. హిందూ సమ్మేళనం ఈ నెల 21వ తేదీన మంగళవారం సాయంత్రం 5 గంటలకు గంగాధర క్షేత్రం సమీపంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో హిందూ సమ్మేళన నిర్వహణ సమితి సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *