ఆదోని జిల్లా సాధన 150వ రోజు దీక్ష సభను విజయవంతం చేద్దామని,

జేఏసీ నాయకులు పగడాల కోదండ, వైపి నాగరాజు బండారి హనుమంతు సుజ్ఞానమ్మ పిలుపునిచ్చారు,,

పయనించే సూర్యుడు ఏప్రిల్ 13 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్. ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదోని జిల్లా కోసం 147వ రోజుకు చేరుకున్నది రిలే నిరాహార దీక్షలో కూర్చున్న రామకృష్ణ, గాజుల రామాంజనేయులు, సుభాష్ చంద్రబోస్, పి కుమార్ ఐ ఎఫ్ టి యు, 147 వ రోజు ఇరిలే నిరాహార దీక్షను జేఏసీ నాయకులు వైపి నాగరాజు, బండారి హనుమంతు, సుజ్ఞానమ్మ దీక్షను ప్రారంభించి వారు మాట్లాడుతూ ఆదోని జిల్లా కోసం కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష ఏప్రిల్ 14వ తేదీ 150వ రోజుకు చేరుకుంటుంది కావున సర్వమత సామూహిక నిరాహార దీక్ష భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ఆదోని మరియు ఐదు నియోజకవర్గాల ప్రజలందరూ కలిసి భాగస్వాములై 150 రోజుల మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నామని అన్నారు అందులో భాగంగానే తరతరాలుగా వివక్షతకు గురి అవుతున్న బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన ఉత్పత్తికి పునాదులైన శ్రమజీవుల పక్షాన బహుజనుల అభ్యున్నతి కోసం అణగారిన ప్రజల హక్కుల కోసం ఉద్యమాలు నడిపిన సామాజిక విప్లవ యోధుడు మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతిని ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, మాజీ మార్కెట్ చైర్మన్ దేవిశెట్టి ప్రకాష్, క్రిస్టియన్ యూనియన్ అధ్యక్షులు రెవ.జి ఆనంద్ రాజు, మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి వారు మాట్లాడుతూ మహాత్మ జ్యోతి రావు పూలే దంపతుల త్యాగనిరతిని కొనియాడుతూ వారి ఆశయాలను ఆయుధాలుగా మలుచుకొని మన ప్రాంత ఆకాంక్ష అయిన ఆదోని జిల్లాగా సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్ల ముందుకొచ్చి పోరాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేస్తున్నాం అన్ని కులాలు మతాలు తెగలు స్త్రీలు బడుగు బలమైన వర్గాల ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థి వ్యాపారస్తులు మేధావులందరూ కలిసి ఆదోని జిల్లా ఉద్యమంలో కలిసికట్టుగా చేయి చేయి కలిపి అడుగులో అడుగు వేసి ప్రజా ఉద్యమ శక్తితో ఆదోని జిల్లాను సాధించుకుందాం అని అన్నారు ఈ కార్యక్రమంలో, ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు దాసరి గోవిందు, గుమ్మల బాలస్వామి, దాసరి నరేష్, ఎస్ బాలన్న, పిఎస్ వీరేష్, మాదాసు జగన్, బండారి గిడ్డయ్య, హెబ్బటం రాజు, జిఎస్ దత్తు,యం శాంతరాజు, వీరాంజి, మఠం వీరభద్రప్ప, గంగపుత్ర సంఘం నాయకులు బెస్త ప్రకాష్, బెస్త దీపక్, గోల్డ్ శీన, సాంబగల్ బాలరాజు,మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *