రోడ్డు భద్రత కు పటిష్ట చర్యలు . 12 స్పీడ్ స్టాపర్లు ఏర్పాటు.

ఆదోని పరిధిలో గ్రామాల వద్ద వేగ నియంత్రణకు చర్యలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్. రోడ్డు భద్రత చర్యలలో భాగంగా, ఆదోని రూరల్ సీఐ నల్లప్ప ఆధ్వర్యంలో, ఈస్వీ పోలీస్ స్టేషన్ ఎస్సై మహేష్ కుమార్ , సిబ్బంది కలిసి ఆదోని–ఆలూరు సిరిగుప్ప రహదారులపై వాహనాల వేగ నియంత్రణ కోసం మొత్తం 12 స్పీడ్ స్టాపర్లు ఏర్పాటు చేశారు. ఈ స్టాపర్లు ధనపురం, నారాయణపురం, సంతకుళ్లూరు గ్రామాల రోడ్ల వద్ద ఏర్పాటు చేయబడినట్లు ఎస్ఐ మహేశ్ కుమార్ తెలిపారు.గ్రామాల సమీపంలో వాహనాల వేగం తగ్గి రోడ్డు ప్రమాదాలు నివారించబడతాయని పేర్కొన్నారు.ప్రజలు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించి, రోడ్డు భద్రతకు సహకరించాలని పోలీసులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *