పుంగనూరు శుబా రా0 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్త్రీశక్తి నా రీ శక్తి వందన్ అదినీ యం2023) కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 14.04.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ) శుభారామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవెంకటేశులు సూచనల మేరకు వైస్ ప్రిన్సిపల్ టి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ షాహిదా భాను ,స్త్రీ శక్తి- (నారీ శక్తి వందన్ అధినియం 2023 ) కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ స్త్రీలకు 33.3% రిజర్వేషన్లను కల్పించారని, స్త్రీలకు కావలసినటువంటి మగవారితో సమానమైన హక్కులు, వారి పరిరక్షణ చట్టాలు గురించి విద్యార్థినీ, విద్యార్థులకు తెలియజేశారు. స్త్రీలు అన్ని రంగాలలో ముందు ఉండాలని, స్వీయ రక్షణను కలిగి ఉండాలని, స్వయం సాధికారతతో వర్ధిల్లాలని తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వపు పోటీలను నిర్వహించి,నారీ శక్తి ప్రతిజ్ఞను చేయడం జరిగింది .అధ్యాపకులు కె కె.అనిల్ కుమార్, డాక్టర్ కె. సోమరాజు, విజయశ్రీ, స్రవంతి, నిర్మల, శ్రావణి , శ్రీనివాసులు, రాం కుమార్, కార్తీక్ మొదలగువారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *