పాలకుర్తి సోమన్న ఆలయంలో మహాద్భుతం

శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నాగు పాము ప్రత్యక్షం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 ( జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)పాలకుర్తి మండల కేంద్రములో కోరిన కోర్కెలు తీర్చే కొలిచి మొక్కిన భక్తుల పాలిటి కొంగు బంగారంలా వెలసిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభూ శ్రీ చండిక సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమవుతుంది ప్రతి నిత్యం మధ్యాహ్నం ఆలయ అర్చకులు స్వామి వార్లకు నైవేద్యం సమర్పించి గుడి మూసివేసిన అనంతరం ఆలయ మహా మండపంలోని గర్భ గుడి ఎదుట కొలువై ఉన్న నందీశ్వర స్వామి వారి వద్ద వారం రోజులుగా ప్రత్యక్ష మై పడుగ విప్పుతూ భక్తులకు కనిపిస్తుంది దీనితో భక్తులుస్వామి వారు పాము రూపంలో దర్శనమిచ్చారని భక్తి పారవశ్యంతో సంతోష పడుతున్నారు అయితే ఆలయ సిబ్బందితెలిపిన వివరాల ప్రకారం వారం రోజులుగా నాగుపాము నందీశ్వర స్వామి వద్ద కొద్దీ సేపు ప్రత్యక్షమై అనంతరం పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్ళిపోతుందని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *