మహా ప్రస్తానం అంబులెన్స్ తక్షణమే ఏర్పాటు చేయాలి.ఏపీ ఆదివాసీ జేఏసీ డిమాండ్.

* రంపచోడవరం ప్రభుత్వ విధాన పరిషత్ ఏరియా హాస్పటల్ నందు మహాప్రస్థానం అంబులెన్స్ తక్షణమే ఏర్పాటు చేయాలి. * జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు మహాప్రస్థానం అంబులెన్స్ సౌకర్యం లేక పోవడంతో ఆదివాసీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంబంధిత శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోరా.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ ఏప్రిల్.15.2026 పోలవరం జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం, రంపచోడవరం కేంద్రంగా జిల్లా కార్యాలయాలు అన్ని ఏర్పాటు. చేస్తున్నప్పటికీ జిల్లా కేంద్రంలో ఎప్పటినుండో ఉన్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు మహాప్రస్థానం అంబులెన్స్ లు ఏర్పాటు చేయకపోవడం.దురదృష్టకరం అని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రంపచోడవరం కేంద్రంగా ఉన్న పోలవరం జిల్లా, కార్యాలయాలకు, ఆసుపత్రులకు మన్యం ప్రాంతంలోని మారుమూల గ్రామాల నుండి జిల్లా కార్యాలయాలకు చేరుకోవాలంటే ఆదివాసీ ప్రజలు జీవించే గ్రామాలకు నేటికీ బీటీ రోడ్డు సౌకర్యం లేదు.మరోవైపు అంబులెన్స్లుమా గ్రామాలకు రావు.ఇంకవైపు మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించింది.కానీ ఏజెన్సీ మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం మూడు పూట్ల ఏర్పాటు చేయకపోవడం అంటే ఆదివాసీలపై వివక్ష చూపించడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమా అని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ద్వజమెత్తారు.ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఆదివాసీ ప్రజలు జీవించే హక్కును కాపాడాలని డిమాండ్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన పోలవరం జిల్లా,రంపచోడవరం కేంద్రంగా ఉన్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి మహాప్రస్థానం అంబులెన్స్ లు ఏర్పాటు చేయాలి. అలాగే ఏజెన్సీ మారుమూల గ్రామాలకు బీటీ రోడ్లు తక్షణమే నిర్మించారు .ప్రతి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్లుసౌకర్యం ఏర్పాటు చేయాలి. రంపచోడవరం కేంద్రంగా ఏపీఎస్ ఆర్టీసీ డిపో తక్షణమే ఏర్పాటు చేసి ఏజెన్సీ మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం మూడు పూట్ల వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర నాయకులు కారం రామన్న దొర,యలగాడ నాగేశ్వరరావు, గంపా నాగరాజు,వేట్ల సరస్వతి, కోసూరి రాజారెడ్డి రెడ్డి,అందాల లింగారెడ్డి, గుమ్మడి లోవ ప్రసాద్, ఈ పూరి వెంకటరమణ, ముర్ల వెంకటేష్ రెడ్డి,తాటి వెంకన్న దొర మొదలైన వారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *