ప్రపంచ మేధావి భారతరత్న బిఆర్ అంబేద్కర్ జయంతి”

"భారతదేశ చేగువేరా జర్జ్ రెడ్డి వర్ధంతి"

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 రాజేష్ దౌల్తాబాద్) ప్రపంచ మేధావులలో ఒకరైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతిని దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు అలాగే భారతదేశం విప్లవ విద్యార్థి సంఘం నిర్మాత జార్జిరెడ్డి 54వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు భారతదేశంలో హక్కుల కోసం,అధికారం కోసం అన్న అసమానతలేని రాజ్యం కోసం మనువాదానికి వ్యతిరేకంగా మానవాళికి అనుకూలంగా సబ్బండ కులాలకు,సంబండ జీవరాశుల హక్కులు కల్పించిన మహా మేధావి భారతదేశంలో పుట్టడం మన అదృష్టమని ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా పిడిఎస్ యు .పూర్వ విద్యార్థి నాయకులు అంబేద్కర్ నీ కొనియాడారు అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తూ అందరికీ విద్య అందరికీ సమాన హక్కులు శాస్త్రీయ విద్యా విధానానికి విద్యార్థులను ఏకం చేసి విద్య హక్కులు, మానవ హక్కులు, మాట్లాడే హక్కులు,వాటి రక్షణ కోసం మనువాదులతో నిరంతరం సంఘర్షణ తో ఉస్మానియా చేగువేరా 54వ స్మారక దినాన్ని దౌల్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించారు వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుండి వారి ఆలోచనను ప్రతి ఒక్కరూ పాటించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అనురాధ రమేష్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పడాల రాములు తిరుమలపూర్ సర్పంచ్ లాలు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి మేకల రాములు బోనాల స్వామి ముత్యాల నరసింహులు సూరంపల్లి మహేందర్ మల్లేశం గౌడ్ మా చిన్ పల్లి .ఎల్లం దుబ్బాక ఎల్లం తోపాటు వివిధ గ్రామాల సర్పంచులు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *