స్వేచ్ఛ సమానత్వపు మార్గం చూపిన మహాత్ముడు పూలే అంబేడ్కర్

* దేశ సామాజిక రాజకీయపరిస్థితి ని సమూలంగా మార్చిన ఘనుడు పూలే .. * భీమ్ వారియర్స్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఉదయ్ స్వేరో వెల్లడి ... * నేడు భీమ్ వారియర్స్ ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు...

పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 13, తల్లాడ రిపోర్టర్ నియోజకవర్గంలో ఈ దేశ సామాజిక రాజకీయ పరిస్థితిని సమూలంగా మార్చి స్వేచ్ఛ సమానత్వము దిక్సూచి నందించిన మహానీయలు పూలే అంబేడ్కర్ జయంతులు కార్యక్రమంలో భాగంగా నేడు మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా వైరా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో స్థానిక రింగ్ సెంటర్లో మహానీయ మహాత్మ జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పుష్ప నివాళులు అర్పించడం జరిగినది.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే త్యాగాల స్వరూపం నేటి బహుజనుల సామాజిక, రాజకీయ,విద్యా చైతన్యానికి తమ అస్తిత్వ ఉద్యమాలకు నిదర్శనం ఏప్రిల్ 1827లో మహారాష్ట్ర లోని పూణేలో జన్మించిన ఆయన తన భార్య సావిత్రిబాయి ఫూలేతో కలిసి మహిళల విద్య కోసం కృషి చేశారు‌1873లో కుల నిర్మూలన కోసం ఆయన ఈ సమాజాన్ని స్థాపించారు.‌సామాజిక సేవలకు గుర్తింపుగా,1888లో విఠల్‌రావు కృష్ణజీ వాండేకర్ ఆయనకు ‘మహాత్మా’ అనే బిరుదును ప్రదానం చేశారు.సమాజంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల, అగ్రకుల పేదల అభ్యున్నతికి అంకితభావంతో పోరాడిన మహనీయుడు ఫూలే.విద్య, సమానత్వం,సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం.ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాన నవ సమాజ నిర్మాణానికి మనమందరం కట్టుబడాలి అని తెలియచేశారు.ఈ కార్యక్రమంలో *స్వేరోస్ నెట్వర్క్ మాజి జిల్లా అధ్యక్షులు,భీమ్ వారియర్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఉదయ్ స్వేరో, ఉపాధ్యక్షులు వై. వెంకటేష్, స్వేరోస్ జిల్లా నాయకులు కంకణాల శ్రీనాద్,ఇండ్ల మహేష్,కొలికపోగు గణేష్ , మాడుగుల శరత్ కుమార్,కోట సాయికుమార్,కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లపు కొండ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మన్నే సత్యనందం,సినియర్ పాత్రికేయులు క్రిష్ణ,బహుజన యువ నాయకులు వంకాయలు సీతారామరాజు,తడికమళ్ళ ఉపెందర్,కాశిమళ్ళ వెంకటేష్,ఇండ్ల ఫణింద్ర,మహెష్,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *