జవహర్ నగర్ బీజేపీ నాయకుడు రంగుల శంకర్‌ను పరామర్శించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 (మేడ్చల్ నియోజకవర్గం మాధవరెడ్డి ) జవహర్ నగర్‌కు చెందిన బీజేపీ నాయకుడు రంగుల శంకర్ అనారోగ్యంతో తీవ్రమైన బ్యాక్ పెయిన్ సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో ఘట్కేసర్ మాజీ ఎంపీపీ మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి స్థానిక నాయకులతో ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు ఈ సందర్భంగా శంకర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అవసరమైన వైద్య సహాయం అందించాలని సూచిస్తూ పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు స్థానిక నాయకులు కూడా పాల్గొని శంకర్ కి ధైర్యం చెప్పి మానసికంగా ప్రోత్సాహం అందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక అధ్యక్షులు కమల్ మాజీ కార్పొరేటర్ పనగంటి బాబు సీనియర్ నాయకులు సంతోష్ గుప్తా యువమోర్చా నాయకులు జోగారావు సన్నీ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *