తెల్కపల్లి లో అంబేద్కర్ సంఘం కమిటీ ఎన్నిక.

తెలకపల్లి గ్రామ నూతన అంబేద్కర్ సంఘం అధ్యక్షుడిగా అంకూరి రాజు.

పయనించే సూర్యుడు. ఏప్రిల్ 11.నాగర్ కర్నూల్ జిల్లా. తెల్కపల్లి మండలం రిపోర్టర్ :సుల్తాన్ తెల్కపల్లి మండలకేంద్రంలో యోగ బిల్డింగ్ లో తెలకపల్లి అంబేద్కర్ సంఘం నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. తెలకపల్లి బహుజన నాయకుల ఆధ్వర్యంలో తెలకపల్లి అంబేద్కర్ సంఘం అధ్యక్షులుగా అంకురి రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా బతికే మల్లేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి కొమ్ము షణ్ముఖ్, కోశాధికారిగా గంగారం అంజి, సలహాదారులుగా రెడ్డపాకుల శివశంకర్, కొమ్ము రాకేష్, కార్యదర్శులుగా బల్మూరు మల్లేష్, భారీగారి భాస్కర్, సాంస్కృత కార్యదర్శులుగా శివగారి లక్ష్మణ్, చంద్రకంటి నాగేష్, గౌరవ అధ్యక్షులుగా బారిగారి పరమేశ్వర్, కొమ్ము ఆనంద్, రెడ్డపాకుల మల్లేష్ బాబు, గుగ్గిళ్ళ ప్రకాష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఎన్నికైన తెలకపల్లి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు అంకూరి రాజు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయసాధనకు తన వంతు కృషి చేస్తానని, రానున్న అంబేద్కర్ జయంతి వేడుకలను అందరం కలిసి విజయవంతం చేయాలని కోరారు, పేద వర్గాలకు ఈ అన్యాయం జరిగిన అంబేద్కర్ సంఘం తోడుగా ఉంటుందని తెలియజేశారు, నాపై నమ్మకం ఉంచి అంబేద్కర్ సంఘం అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలకపల్లి బహుజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *