పయనించే సూర్యుడు ఏప్రిల్ 11, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) చింతకాని మండలంలోని సీతంపేట గ్రామ పంచాయతీ పరిధిలో డాక్టర్ జయశ్రీ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ శిబిరంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ కంటి సమస్యలకు పరీక్షలు చేయించుకున్నారు.శిబిరంలో వైద్యులు వివిధ రకాల కంటి సమస్యలను పరిశీలించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు. అలాగే, కంటి సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారాలపై వైద్యులు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆళ్ల మణి-పానకాల రావు, ఉప సర్పంచ్ జాల రమేష్, దేవస్థాన డైరెక్టర్ వేగ్గళం పాండురంగ చారి, గ్రామ పెద్దలు మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొని శిబిరం విజయవంతానికి సహకరించారు.