
పయనించే సూర్యుడు న్యూస్ : ఏప్రిల్ /11:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సిద్దిపేట జిల్లా మానకొండూర్ నియోజకవర్గం బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన 35 మంది దళితులకు సంబంధించిన భూసమస్య పరిష్కారానికి మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఇచ్చిన హామీని నిలుపుకున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఈ గ్రామ పరిధిలో గల 63.18 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి 35 మంది లబ్ధిదారులకు భూమి రిజిస్ట్రేషన్ చేశారు. అయితే గత 8. వ సంవత్సరాలుగా భూసర్వే, మ్యుటేషన్ పెండింగ్ లో పెట్టడంతో ఆ భూములు వారికి దక్కకుండా పోయాయి. ఈ సమస్యను అసెంబ్లీ ఎన్నికల సమయంలో గూడెం గ్రామానికి ప్రచారానికి వచ్చిన సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ, దృష్టికి ఆర్టిఐ ప్రచార కమిటీ చైర్మన్ రాసూరి మల్లికార్జున్ తీసుకువెళ్లారు. సమస్య తీవ్రతను తెలుసుకున్న కవ్వంపల్లి ఎమ్మెల్యేగా గెలిపిస్తే తప్పకుండా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ దళితుల సమస్య పరిష్కారానికి పూనుకున్నారు. అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ తో పాటు రెవిన్యూ యంత్రాంగాన్ని సమన్వయం చేసి గూడెం భూ లబ్ధిదారులకు ముటేషన్, భూసర్వే చేయించిన మీదట ఆ భూములపై సదరు దళితులకు హక్కు కల్పిస్తూ వాటి స్వాధీనపర్చారు. దీంతో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉంటున్న దళితుల భూసమస్యకు ఎట్టకేలకు పరిష్కారమైంది. దీంతో గూడెం దళితులకు ఇచ్చిన హామీని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి నిలుపుకున్నట్టయింది. ఇదిలా ఉండగా, గూడెం దళితుల భూసమస్యను పరిష్కారానికి పాటుపడి మాట నిలుపుకున్న ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను ఆర్టీఐ ప్రచార కమిటీ చైర్మన్ రాసూరి మల్లికార్జున్, జిల్లా సహకార కేంద్ర బ్యాండ్ డైరెక్టర్ అలువాల కోటి, దళిత సంఘాల నాయకులు సముద్రాల లక్ష్మణ్, రెడ్డిగాని రాజు, మామిడి అనిల్, మీసాల అంజయ్య, బోయిని కొమురయ్య, ఎలుక రాజు, మాతంగి లక్ష్మణ్, కన్నం లక్ష్మణ్ తదితరులు శుక్రవారం క్యాంపుకార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.