పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 16 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోగల సాయి కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కళ్యాణి ఆధ్వర్యంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులతో నూతన విద్యార్థుల కోసం ఎన్రోల్మెంట్ డ్రైవ్ ను నిర్వహించారు. పట్టణంలో గల లేబర్ కాలనీ, పాత ఐటిఐ వీధులలో ఇంటింటికి వెళ్లి నూతన విద్యార్థుల కోసం పర్యవేక్షించి తల్లితండ్రులతో పాఠశాలలో గల సౌకర్యాలు, సిబ్బంది పనితీరు గూర్చి సంభాషించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా బుధవారం ఆరుగురు విద్యార్థులు పాఠశాలలో ప్రైమరీ తరగతులకు ఎన్రోల్మెంట్ అయినట్లు ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. ఎన్రోల్మెంట్ అయిన విద్యార్థులకు పలాస మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు, బి.సత్యం వారిని ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు బి భారతి వ్యాయామ ఉపాధ్యాయుడు సిహెచ్ ఆర్ రాంజీ సంతోష్ బాలమ్మ జయమ్మ జయలక్ష్మి పార్వతి ప్రసాదు, గౌరీ శంకర్ పాల్గొన్నారు