మునుగోడులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంని సందర్శించిన మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి .

పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు ఏప్రిల్ 10. మునుగోడు మండల స్థానిక పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ని సందర్శించిన మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పై ప్రెస్ మీటు లో మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా కూడా ఎలక్షన్లలో 50 పడకల హాస్పిటల్ కడతా అని హామీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి . అ హమిని పూర్తిగా విస్మరించారు . మేము అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ హాస్పిటల్లో పూర్తి సౌకర్యాలు కల్పించాము . నేడు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు . ఈరోజు రైతులు పుస్తెలతాడు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యం మరియు రాజగోపాల్ రెడ్డి వైఫల్యమే .రాజగోపాల్ రెడ్డి కి నేను ఒక ఒక విషయంలో రిక్వెస్ట్ చేస్తున్న ఏందంటే వయసులో పెద్దగా ఒక మంచి మాట చెప్తున్నాను. వచ్చేది ఉంటే ఎవరు ఆపిన ఆగదు .కానీ మునుగోడు ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని మునుగోడు ప్రాంతాన్ని ఎడారిగా మార్చొద్దని అన్నారు ఈ కార్యక్రమంలో మునుగోడు మండల అధ్యక్షులు మందుల సత్యం , ప్రధాన కార్యదర్శి పగిళ్ల సతీష్, మండల సంయుక్త కార్యదర్శి మదనబోయిన పరమేష్,నల్గొండ అంజి బిఆర్ఎస్ సర్పంచులు ఉప సర్పంచ్లు మరియు మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *