పయనించే సూర్యుడు న్యూస్ చౌటుప్పల్ ఏప్రిల్ 10. మునుగోడు నియోజకవర్గం లోని చౌటుప్పల్ పట్టణంలో జాతీయ రహదారి 65 విస్తీర్ణంలో భాగంగా చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అండర్ పాసింగ్ ఇవ్వాలని కోరుతూ గురువారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి – సాయిలు ఆధ్వర్యంలో వార్డు ప్రజలు హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దగోని మౌనిక – రమేష్ గౌడ్, వార్డు ప్రముఖులు గంట్ల బుచ్చిరెడ్డి-చెల్లమ్మ, తూర్పాటి నరసింహ, తూర్పాటి శంకర్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాదాని గోపాల్, మున్సిపల్ ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు ముత్యాల గణేష్, వార్డు అధ్యక్షులు షేక్ యూసుఫ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మాదాని రాధ, అంబటి మహేష్, ముత్యాల మహాలక్ష్మి, సుర్కంటి వైష్ణవి, ఎడ్ల సత్తమ్మ, పెద్దగోని అంజయ్య గౌడ్, నల్ల లింగారెడ్డి, తూర్పాటి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.