ఆర్టీసీ డిపోలో పూలే జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్, ఏప్రిల్ 12 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ ) : మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలను కొనసాగించాలని ఏలేశ్వరం ఆర్టీసీ డిపో మేనేజర్ జి వి సత్యనారాయణ పిలుపునిచ్చారు.పూలే 199వ జయంతి వేడుకలను స్థానిక ఆర్టీసీ డిపోలో రాష్ట్ర బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు భీమన సూరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి డిపో మేనేజర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఫూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా డిపో మేనేజర్ జీవి సత్యనారాయణ మాట్లాడుతూ నేటి యువత కార్మికులు ఉద్యోగస్తులు ఫూలే ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగాలన్నారు.రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమన సూరిబాబు మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.తమ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం చొరవ చూపాలన్నారు.అనంతరం ఫూలే జయంతి సందర్భంగా డిపో మేనేజర్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో కే టి మూర్తులు,ఎల్ వి ఎస్ నారాయణ,ఎన్ నారాయణ, కే ప్రవీజ్, ఏ బి జి ఎస్ రావు,జె శ్రీను,ఎస్ సి హెచ్ బాబు,గ్యారేజీ సురేష్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *