చిట్టిరెడ్డిపల్లిలో ప్రారంభమైన గంగ జాతర సంబరాలు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 14.04.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) చౌడేపల్లి పరిధిలోని చిట్టిరెడ్డిపల్లి లో సోమవారం గంగ జాతర సంబరాలు ప్రారంభమయ్యాయి ఈనెల 13 నుంచి 15 వరకు గ్రామంలో నడివీధి గంగమ్మ జాతరను నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు ఈ మేరకు కుప్పాల రంగస్వామి దంపతుల ఆధ్వర్యంలో వేద పండితుల సమక్షం నందు పలు పూజాధి కార్యక్రమాలు నిర్వహించారు గణపతి హోమం శాంతి హోమం గ్రామదేవతలకు విశేష పూజలు అనంతరం మహిళలచే గంగరాయి పై జల పాలాభిషేకాలు నిర్వహించారు గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మహిళలు కలిశారు తీసుకుని వచ్చి అమ్మవారి చెంత విశేష పూజలు పాల్గొన్నారు అనంతరం నిర్వాహకులు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *