మైనారిటీలపై మరియు ఉర్దూ భాషపై తనదైన శైలిలో మరో సారి

ప్రత్యేక చోరువ చూపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 16 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చరిత్రలో మొదటి సారి 100% బడ్జెట్ ఉపయోగిస్తూ (2025-26) ఉర్దూ అకాడమీ చరిత్ర సృష్టించటం ప్రశంసనీయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 36 ఉర్దూ అకాడమీ సెంటర్లకు దాదాపు 300 నూతన కంప్యూటర్లు కేటాయించి నూతన శకం ప్రారంభించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తోంది. సీనియర్ టిడిపి నాయకులు మంత్రి ఎన్.ఎం.డి ఫరూఖ్ అపార అనుభవం ఈ విజయానికి మరో ముఖ్య కారణం అర్హత కలిగిన వ్యక్తి అకాడమీ చైర్మెన్గా ఉంటే ఎటువంటి లబ్ది సమాజానికి జరుగుతుందో స్పష్టంగా చేతలలో చూపించిన ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షిబ్లీ దేశంలోనే ఉర్దూ భాష “మొహసిన్” అనగా పరోపకారి చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన్ని మొహసినే ఉర్దూ నారా చంద్రబాబు నాయుడు అని ఉర్దూ భాష ప్రేమికులు ఆయన్ని ఎంతో ఇష్టంగా అభిమానంగా పిలుచుకుంటారనటంలో అతిశయోక్తి కాదు. రాబోయే రోజుల్లో ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షిబ్లీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉర్దూ భాష పరిడవిల్లుతోందనటంలో అతిశయోక్తి లేదు. ఎ. నూర్ అహ్మద్, ⁠యం హెచ్ పి యస్ రాష్ట్ర కార్యదర్శి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *