విద్యుత్ సమస్యల నివారణకే పరిష్కార వేదికలు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఏప్రిల్ 16 మామిడిపెల్లి లక్ష్మణ్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకే మండలాల వారీగా విద్యుత్ సమస్యల పరిష్కార వేదికలు నిర్వహిస్తు న్నట్లు తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ సి.జి.ఆర్.ఎఫ్. చైర్ పర్సన్ ఎరుకల నారాయణ పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ సబ్ డివిజన్ పరిదిలోని వడ్డేలింగాపూర్, రాయికల్, సారంగాపూర్ బీర్పూర్ సెక్షన్లోని విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలోని వినియోగదారుల సమస్యల పరిష్కారానికి గాను బుధవారం వడ్డేలింగాపూర్ సబ్ స్టేషన్ లో వినియోగదారుల పిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక ఛైర్పర్సన్ ఎరుకల నారాయణ మాట్లాడుతూ వినయోగదారులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందన్నారు. సమావేశంలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక సభ్యులు సలంద్ర రామకృష్ణ, శేర్ల సత్యనారాయణ, మర్రిపెల్లి, రాజాగౌడ్, ఎస్ఈ సుదర్శనం, డీఈఈ గంగారాం, ఎస్ఏఓ శ్రీనివాస్, ఏడిఈ సింధూర్ శర్మ, ఏఏఓ శంకర్, ఏఇ రాజేశం, సబ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ లక్ష్మయ్య, లైన్మెన్ ఆంజనేయులు, విద్యుత్ సిబ్బంది వినియోగదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *