గ్రామపంచాయతీ వద్ద అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళులు

"వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ గంగాధర్ స్వప్న ఉప సర్పంచ్ తాటి సాయి"

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గంగాధర్ స్వప్న స్వామి మరియు ఉప సర్పంచ్ తాటి సాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్వప్న స్వామి మాట్లాడుతూ అంబేద్కర్ గారు సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని, అనేక విద్యలను అభ్యసించి భారత రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించిన ప్రపంచ మేధావి అని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, ముఖ్యంగా యువత అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు బొల్లం రాజేష్, గంగాధరి దుర్గయ్య, కేంబా సారీ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇందిరమ్మ కమిటీ సభ్యులు దోమల సాయిలు, ముత్యాల శ్రీనివాస్, తలారి నరసింహులు, జంగం శంకర్, శేఖర్, ఇసాక్, రాజు, పోచయ్య మరియు గ్రామ యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామస్థుల సమక్షంలో జరిగిన ఈ జయంతి వేడుకలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *