అక్షర యోధుడికి అక్షర సుమాంజలి  

డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి లో పాల్గొన్న సర్పంచ్ గాయత్రి మల్లేష్ గౌడ్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్  మండల పరిధిలోని రాయపల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మంగళవారం రోజు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ కిష్టారం గాయత్రి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయన రచించిన రాజ్యాంగం వల్లే నేడు అందరికీ సమాన హక్కులు లభిస్తున్నాయని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవి ప్రకాష్, అంగన్‌వాడీ టీచర్, ఆశా వర్కర్, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువకులు , గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, డాక్టర్ బాబాసాహెబ్ చేసిన సేవలను స్మరించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *