
పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 16 వత్సవాయి మండలం, రామచంద్రపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ములకలపల్లి నవీన్ తల్లి ములకలపల్లి జానకి ద్వితీయ వర్ధంతి సందర్భంగా, జగ్గయ్యపేట పట్టణంలోని అన్న క్యాంటీన్‌లో ఈరోజు నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ కోసం రూ. 10,000/-లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఇర్రి నరసింహారావు, డోగుపర్తి నాగభూషణం, కొర్రకూటి సైదులు మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.