పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 నేరెడుచెర్ల మండల ప్రతినిధి (చింతల శ్రవణ్ ) సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే అని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు అన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల లో జ్యోతిరావు పూలే 199వ జయంతిని ప్రధాన కూడలిలో నిర్వహించిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం మాట్లాడుతూ అంటరానితనాన్ని ఎండగట్టి సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త అని మానవ హక్కులకై ఉద్యమించిన సామాజిక విప్లవకారుడు అని బాలికల విద్యాభివృద్ధికి పాటుపడిన ఆదర్శప్రాయుడుఅని సమసమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్పూర్తి ప్రధాత నిలిచిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని ఆయన అన్నారు ఆనాడు ఆయన మహిళాభ్యుదయానికి పునాదులు వేశాడని నేడు మనందరం మహిళలకు నిజమైన స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా వారి చేతిలో నిజమైన అధికారం పెట్టడం ద్వారా గ్రామస్థాయి నుంచి దేశ స్థాయి వరకు పేద ప్రజలకు విద్య వైద్యం జీవనోపాధి అవకాశాలు కల్పించడమే మహాత్మ పూలేకు మనమిచ్చే ఘన నివాళ